దళితబంధును చూసి కాంగ్రెస్-బీజేపీ భయపడుతోంది..

266
- Advertisement -

రాజకీయ నేతల భాష చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి. గురువారం ఆయన టీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతల భాష రాష్ట్ర యువతకు, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాము. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రేస్ నేతలు రేవంత్ రెడ్డి భాష చూసి అచ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లఫంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి నిన్నగాకమొన్న వచ్చాడు. 75 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ కుటుంబం అని విమర్శించారు.

ఉద్యోగాలు ఇవ్వలేదు అనే కాంగ్రేస్ మాటలను ఖండిస్తున్నాము. వడ్డీలేని రుణాలను మహిళలకు వేలకోట్లు ఇచ్చాము. రేవంత్‌కు టీపీసీసీ అధ్యక్షుడుగా ఉద్యోగం ఇచ్చిందే కేసీఆర్. దళితబంధును చూసి ఎందుకు బీజేపీ- కాంగ్రెస్ భయపడుతోంది. ఇన్ని ఏళ్లలో దళితుల అభివృద్ధి కోసం ఎవరైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ఆళ్ళ ప్రశ్నించారు. హుజురాబాద్‌లో కాంగ్రేస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా?..కాంగ్రేస్ పార్టీకి దమ్ముంటే హుజురాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకొని చూపించాలి.నలుగురు సిటీలు వేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు హెచ్చరించారు ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి.

- Advertisement -