జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..

327
MLA Alla Venkateshwar Reddy
- Advertisement -

గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. ఆయన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జమ్మి మొక్కను నాటారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా పచ్చదనం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు,మున్సిపాలిటీ వార్డ్ లలో దేవాలయాలు, స్కూల్స్ లో 500 జమ్మి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -