‘కొండపొలం’ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్‌..

19

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్‌. ఇప్ప‌టికే రిలీజ్‌ వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, ఓబులమ్మ సాంగ్‌కి మ‌రియు రీసెంట్‌గా రిలీజ్ చేసిన కొండ‌పొలం ట్రైలర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ శ్వాసలోపాట‌ని విడుదల చేశారు మేక‌ర్స్‌.

స్వ‌ర‌వాణి ఎంఎం కీరవాణి మార్క్ చూపించే రొమాంటిక్ మెలోడి గీత‌మిది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని కూడా అందించ‌డం విశేషం. ఆయన సాహిత్యం, బాణీ ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తోంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీని మరో లెవెల్‌లో చూపించారు. యామిని ఘంటసాల, పీవీఎన్ఎస్ రోహిత్ ఈ పాటను శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట మరో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిపోనుంది. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల నుంచి ఈ కథను తీసుకున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
సాంకేతిక బృందం
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్
కథ : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి
ఎడిటర్ : శ్రావన్ కటికనేని
ఆర్ట్ : రాజ్ కుమార్ గిబ్సన్
కాస్టూమ్స్ : ఐశ్వర్యా రాజీవ్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో : వంశీ-శేఖర్