కల్యాణలక్ష్మి, చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

318
mla venkateshwar reddy
- Advertisement -

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వనపర్తి జిల్లాలోని మదనాపురం మండలంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, రైతుబీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధితో చరిత్ర తిరగ రాసిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అభివర్ణించారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -