గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తితో మొక్కలు నాటిన చిన్నారులు..

250
Green Challenge
- Advertisement -

ఈ రోజు హైదరాబాద్ శివారులోని కిస్మత్ పూర్ చరిష్ ఆశ్రమంలో మాగ్నిజంట్ డిజిటల్ సొల్యూషన్స్ డైరక్టర్ గర్రెపల్లి సతీష్ జన్మదిన వేడుకలు ఆశ్రమ చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నవ్వుల కేరింతల మధ్య తన పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సతీష్ తెలిపారు. కేవలం పుట్టిన రోజు సందర్బంగా వేడుక చేసుకోవడమే కాక చిన్నారుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఆశ్రమం పిల్లల్తో 30 మొక్కలు నాటించి వాటి సంరక్షణ భాధ్యతను కూడా వారికి అప్పగించడం జరిగింది.

ఈ సందర్బంగా సతీష్ మాట్లాడుతూ ..ఈ రోజు తన పుట్టినరోజును కల్మషం లేని చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తన జీవితంలో ముఖ్యమైన మరియు తన ఎదుగుదలకు పాటు పడే వ్యక్తులు ఇద్దరిని వారిలో ఎం పి సంతోష్ కుమార్, కిషన్ కవికొండల ( ఎస్‌కే ఇంటర్నేషనల్‌ ) చైర్మన్ వారు ఇద్దరు తనకు స్ఫూర్తి మార్గదర్శకులని వారి ప్రోత్సహం ఎల్లప్పుడూ తనకు ఇలానే లభించాలని కోరుకుంటూ సమాజంలో అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలని సతీష్ తన ఆకాంక్షని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనిత రెడ్డి, వేణుగోపాల్, హారిక , కిషోర్ , సర్కార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -