టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న KKR..

116
kkr

ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్ కతాకు బ్యాటింగ్ లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అదే లైనప్ ను కొనసాగించాలని నిర్ణయించింది. బౌలింగ్ విభాగంలోనూ మార్పులేమీ లేవు. ఇక చెన్నై జట్టులో ఓ మార్పు చేశారు. లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా స్థానంలో మరో లెగ్గీ కర్ణ్ శర్మకు చోటిచ్చారు. ఇరు జట్లు గెలిచి విజయాన్ని తమ ఖాతలో వేసుకొవాలని చూస్తున్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (wc,c), ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, శివం మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(c,wc ), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, కరన్ శర్మ