జల్‌ జీవన్‌కు మిషన్ భగీరథే స్పూర్తి: ఎర్రబెల్లి

728
dayakar rao
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్‌ పథకానికి స్పూర్తి మిషన్ భగీరథ పథకమని తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం తరుపున సమగ్ర నివేదికను అందించారు ఎర్రబెల్లి.

ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్రమోడా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ను కార్యక్రమాన్ని ప్రకటించారని చెప్పారు. తెలంగాణలోని మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలను తొలగించడంతోపాటు ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయడం లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.

మిషన్‌ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని చేపట్టింది. 2024 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ని వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాన్ని ఇచ్చామని…అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఉన్న మిషన్‌ భగీరథ కార్యక్రమం… కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ఒక్కటే కాబట్టి నిధుల పరంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరామని చెప్పారు.

dayakar

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ కార్యక్రమం అంచనా వ్యయం రూ.40,028 కోట్లు. దీంట్లో 80 శాతం నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో… మిగిలిన 20 శాతాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ చొరవకు అభినందనలు తెలిపారని గుర్తుచేశారు.

అన్ని రాష్ట్రాలకు మార్గదర్శంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమం హడ్కో అవార్డు కూడా ఎంపికైందన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రారంభించినందున… మిషన్‌ భగీరథకు సపోర్టు చేసేలా 50 శాతం నిధులను భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరామని చెప్పారు.మిషన్‌ భగీరథ కార్యక్రమం నిర్వహణకు ప్రతి ఏటా అయ్యే రూ. 2,110 కోట్ల మొత్తం అవసరమవుతుంది. నిర్వహణ ఖర్చు మొత్తాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని కోరినట్లు వెల్లడించారు.

- Advertisement -