బిగ్ బాస్3.. హైపర్ ఆది వైల్డ్ కార్డ్ ఎంట్రీ

470
hyper-aadi-Bigg-Boss-3
- Advertisement -

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హైపర్ ఆది. జబర్ధస్త్ షో వల్ల చాలా మంది కమెడీయన్ లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు జబర్ధస్ధ్ షో ఎంతో మంది కమెడీయన్ లు ఉన్నా అందులో హైపర్ ఆది చాలా ఫేమస్ అయ్యాడు. హైపర్ ఆది స్కీట్ కోసమే చాలా మంది జబర్ధస్త్ షో చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే హైపర్ ఆది పలు సినిమాల్లో నటించిన పెద్దగా అక్కడ పేరు రాకపోవడంతో జబర్ధస్త్ లోనే కొనసాగుతున్నాడు.

తాజాగా హైపర్ ఆదికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది బిగ్ బాస్ 3 హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. అందుకోసమే ఆయన జబర్ధస్త్ షో కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషా రెబ్బ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక వేళ ఈవారం ఈషా రెబ్బ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వకపోతే హైపర్ ఆది బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -