మిషన్ భగీరథ పూర్తి : కృపాకర్ రెడ్డి

1376
mission bhagiratha
- Advertisement -

రూ. 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో పూర్తిచేశారని చెప్పారు ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృపాకర్..కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు.

తెలంగాణ లోని ప్రతి ఇంటికి నల్లల బిగింపు పూర్తి అయింది… సురక్షిత జలాలు అందుతున్నాయని చెప్పారు. భగీరథ నీటి విశిష్టత తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని చెప్పిన ఆయన….ప్రతి ఒక్కరు భగీరథ నీటిని వినియోగించుకోవాలన్నారు.

భగీరథ నీటి విశిష్టతను తెలుసుకోవాలని సూచించిన ఆయన ఆర్వో ప్లాంట్‌లలో నదుల నీటిని అత్యంత సురక్షితంగా తయారు చేసి సరఫరా చేస్తున్నామని చెప్పారు.భగీరథ నీటి ద్వారా తెలంగాణలో ఫ్లోరైడ్ కు, ఇతరత్రా జబ్బులకు చరమగీతం పాడామని వెల్లడించారు.

Mission Bhagiratha completes says ENC Krupakar reddy..Mission Bhagiratha completes says ENC Krupakar reddy

- Advertisement -