మొక్కలు నాటిన మురళిమోహన్, కోటశ్రీనివాస్ రావు

322
Kota Srinivas Rao Murali Mohan

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా దూసుకుపోతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి రోజు రోజుకి విశేష స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటుతున్నారు. కాగా తాజాగా సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్ జయభేరి సిలికాన్ లో మూడుమొక్కలు నాటారు. ప్రముఖ నటీ జయసుధ మురళి మోహన్ కు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ పాల్గోన్నారు. అనంతరం మరో ముగ్గురికి ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసరాల్సిందిగా కోరారు. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కేల్ నారాయణ, ముప్ప చైదరికి మురళిమోహన్ సవాల్ విసిరారు.

ఈసందర్భంగా మురళిమోహన్ మాట్లాడుతూ.. ఈరోజు దేశంలో చాలప్రదేశాలలో వాయుకాలుష్యంతో పాటు ఇతర కాలుష్యాలవలన మనిషి బతకడం కష్టంగా మారింది. మనిషి సక్రమంగా ‌బతకలంటే చెట్టు నాటవల్సిన అవసరం ఉంది . చెట్లు పెంచితే ‌సచ్చమైన గాలి వస్తుంది. యంపి సంతోష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాల చక్కని కార్యక్రమం అన్నారు. ఇప్పటికీ వరకు మూడు కోట్ల మొక్కలు నాటారు. ‌ప్రతి వ్యక్తి మూడు మొక్క నాటి మిత్రులకు చాలెంజ్ విసిరితే వాళ్ళు మళ్ళి మూడు మొక్కలు నాటుతారు…. కాదంబరి కిరణ్ ,రాఘవ కూడ ఇలాంటి కార్యక్రమంలో ఉత్సవంగా పాల్గొన్ననడం‌‌ ‌సంతోషంగా ఉంది. ఈకార్యక్రమాన్ని ప్రారంభించిన యంపి‌ ‌సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.

kota Srinivas Rao

మరోవైపు సినీయర్ నటుడు కోట శ్రీనివాస్ రావు కూడా గ్రీన్ ఛాలెంజ్ సవాల్ను స్వీకరించారు. ఈ సందర్భంగా యంపి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం చాల గోప్ప కార్యక్రమం అని అయన యంపి‌ సంతోష్ కు అభినందనలు తెలిపారు కోట శ్రీనివాస్ రావు.

muralimohan