విశ్వసుందరిగా బొన్ని గాబ్రియేల్..

49
- Advertisement -

మిస్‌ యూనివర్స్-2022గా నిలిచింది అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్‌లో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే పోటీలు అంగరంగర వైభవంగా జరిగాయి. 80 దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొనగా అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది.

వెనెజులా భామ అమండా దుడామెల్‌ మొదటి రన్నరప్‌గా, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన అండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివితా రాయ్‌ ఈసారి విశ్వసుందరి పోటీల్లో పాల్గొనగా 16వ స్థానానికి పరిమితమైంది.

భారత్‌కు ఇప్పటివరకు మూడు సార్లు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. సుస్మితాసేన్‌ (1994), లారాదత్తా (2000), హర్నాజ్‌ సంధు (2021) విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -