Mirai:మిరాయ్ డే1 వసూళ్లు

6
- Advertisement -

తేజ సజ్జా నటించిన మిరై సినిమా అంచనాలకు మించి సంచలనాత్మక ఓపెనింగ్‌తో ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపుదిద్దుకోగా, ఇందులో మనోజ్ మంచు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వాస్తవానికి తొలిరోజు రూ.25 కోట్లు రాబడుతుందని అంచనా వేయగా ఆ అంచనాలను మించి రూ. 27.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

రెండవ రోజు ఆల్-ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజుకంటే ఎక్కువగా నమోదయ్యాయి. దీనికి తోడు వీకెండ్‌ కావడంతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతి బాబు, జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతాన్ని అందించారు.

Also read:అనితా..యాంకరా?,హోంమంత్రా?:రోజా

- Advertisement -