ఐష్‌ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు

8
- Advertisement -

హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియోలను వాడుకుంటున్నారని ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది ఐశ్వర్య.

కొందరు వ్యక్తులు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం… ఇకపై ఐశ్వర్య రాయి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, పేరును వాడటానికి వీలు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఈమేరకు ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం.

Also Read:Mirai:మిరాయ్ డే1 వసూళ్లు

- Advertisement -