తేజా సజ్జా హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం మిరాయ్. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఏకంగా రూ.27 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమాకు రవి తేజ నటించిన ఈగిల్ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. మనోజ్ మంచు ప్రతినాయకుడిగా నటించాడు.
హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా విడుదల చేశాడు. ఉత్తర భారత ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి, డిస్ట్రిబ్యూటర్ ‘బై 1 గెట్ 1’ ఆఫర్‌ను ప్రకటించారు. ఈ ఆఫర్ హిందీ డబ్ వెర్షన్‌కే పరిమితం, అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వర్తించదు.
మిరాయ్ కూడా హనుమాన్ లాంటి మ్యాజిక్‌ను ఉత్తర భారతదేశంలో సృష్టించగలదా అనే ఆసక్తి నెలకొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రితికా నాయక్, శ్రీయా శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతం అందించారు.
Also read:ఏపీలో బార్ల లైసెన్స్ గడువు పెంపు

