కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె బాటలోనే పయనించేందుకు మరికొంతమంది సెలబ్రెటీలు సిద్ధమయ్యారు.
తాజాగా తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి తాజాగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా తప్పనిసరి తాను మొదట్లో అనుకున్నానని.. కానీ కాలంతో పాటు మనము కూడా అప్‌డేట్ అవ్వాలన్న ఆలోచన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపింది.
తాను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో నాలో నెగిటివిటీని పెంచడమే కాకుండా ఒక సర్కిల్‌లో లాక్ అయ్యేలా చేసింది… నాకు నేను ఏదో ఒక సూపర్ నెట్‌గా మారిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక మహిళగా, నేను చాలా కష్టపడి నన్ను నేను మెరుగుపరుచుకున్నాను, కానీ సోషల్ మీడియాకి లొంగిపోవడానికి నేను ఇష్టపడలేదు…నేను నిజంగా మంచి సినిమా చేస్తే, మీరు పాత తరహాలోనే ప్రేమను పంచుతారని ఆశిస్తున్నానంటూ ఐశ్వర్య రాసుకోచ్చింది.
Actress Aishwarya Lekshmi quit social media! pic.twitter.com/eHoJ11LQc2
— MalayalamReview (@MalayalamReview) September 13, 2025
Also Read:ఏపీలో బార్ల లైసెన్స్ గడువు పెంపు

