రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి.. వీడియో

268
- Advertisement -

ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తంతో తడుస్తూనే ఉన్నాయి. నిత్యం జరిగే ఈ భయానక ఘటనల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో వైకల్యాలనికి గురవుతున్నారు. కానీ తాజాగా జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఒక చిన్నారి సురక్షితంగా బయటపడింది. అసలు వివరాల్లోకి వెళ్తే, చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బెంగళూరు నుండి తుమ్‌కూర్‌కు బైక్‌పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్‌ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు.

Bike Accident Bangalore

కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సుక్షితంగా బయట పడింది. ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్‌లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.

https://youtu.be/9jh5lI3O-uk

- Advertisement -