అఖండపైనే ఆశలు పెట్టుకున్న ప్రగ్యా..!

48
pragya

నిత్యం హాట్ ఫోటోలను షెర్ చేస్తూ కుర్రకారు మతిపొగెట్టే బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. జయ జానకి నాయక తర్వాత బాలయ్యతో కలిసి అఖండ సినిమాలో నటిస్తున్న ప్రగ్యా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొనగా ప్రగ్యా సైతం తన అందాల ఆరబోతకు పనిచెప్పింది. ఆకట్టుకునే కళ్లు, రూపంతో కూడిన ఫోటోను షేర్ చేసి ఫిదా చేసేసింది. ఈ బ్యూటీ అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటే ఆమె ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు.

ఇటీవలే విడుదలైన ‘అఖండ’ టీజర్ టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. యూట్యూబ్ లో తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

కంచె సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రగ్యా తర్వాత ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.