అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌..

313
kcr
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్‌సాగర్‌లోకి నేడు నీళ్లు చేరుకున్నాయి. మంత్రులు హారీష్ రావు మరియు కేటీఆర్‌ పూజలు నిర్వహించి ప్రాజెక్టులోకి నీళ్లను వదిలి ప్రారంభోత్సవం చేయడం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆనాడు ఆ భగీరథుడు దివి నుండి భువికి నీటిని తీసుకొస్తే.. ఈనాడు అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌ తెలంగాణలో కింది నుండి పైకి గోదావరి నది నీటిని తీసుకురావడం ఒక అద్భుతమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజలు ధన్య జీవులు. చిరస్మరణీయ ఘట్టం మా చేతుల మీదుగా ప్రారంభం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీశ్‌రావుకు అభినందనలు తెలిపిన కేటీఆర్…. మెతుకు సీమ తెలంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నా అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగూణంగా హరీశ్‌రావు శ్రమించారని కొనియాడారు.

- Advertisement -