- Advertisement -
ఆదివారం లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు.
- Advertisement -