ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం సతీమణి శోభమ్మ ..

43

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సతీమణి శోభ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శోభమ్మ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

అనంతరం పద్మారావు గౌడ్ ఇంటివద్ద మహంకాళి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన పూజలో ముఖ్యమంత్రి సతీమణి శోభా, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.