పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యం: కేటీఆర్‌

249
ktr
- Advertisement -

నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపైన మంత్రి కే తారకరామారావు ఈరోజు హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి జరిగిన ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, పురపాలక సంఘాల చైర్పర్స న్లు, పురపాలక సంఘాల కమిషనర్లు, జిల్లా ఎడిషన ల్, కలెక్టర్ జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

పౌరుల యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు ,పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపైన ప్రధాన దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ రోజు హైదరాబాదులో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను తూచా తప్పకుండా అమలు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని పురపాలక పట్టణాలలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పురపాలక పట్టణాల వారిగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ పట్టణాల్లో తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నల్గొండ మరియు మిర్యాలగూడ పట్టణాలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసే దిశగా సహకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు ఆయన పురపాలిక వారీగా ఉన్న అవసరాల మేరకు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి పట్టణంలో అవసరమైన మేరకు టాయిలెట్ల నిర్మాణం, బస్ బేల నిర్మాణం వంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టాలన్నారు.

ప్రస్తుతం ఉన్న వర్షాకాల నేపథ్యంలో పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే కూల్చివేయాలని ఇలాంటి చోట్ల ప్రమాదాలు జరిగితే స్థానిక చైర్మన్ కమిషనర్ల బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన నల్గొండ జిల్లా పర్యటన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు పురపాలక శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -