కరోనా ఎఫెక్ట్ బత్తాయి రైతులపై పడకుండ, వారి దిగుబడులను అమ్ముకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు. నల్గొండ కాలెక్టరేట్‌లో బత్తాయి కొనుగోళ్లపై అధికారులతో,రైతులతో, ట్రేడర్‌లతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బత్తాయి పంటలు సాగు చేసే నల్గొండ జిల్లాలో రైతులు తమ దిగుబడులను ఢిల్లీ, కలకత్తా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా అన్ని అనుమతులు ఇచ్చామని రైతులు స్వదీనియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.
నల్గొండ జిల్లాలో కూడా స్థానికంగా ప్రజలు బత్తాయిలు తినెల అవగాహన కలిపిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలో బత్తాయి మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీనితో పాటు మొబైల్ రైతు బజార్ ఆటోలను కూడా ప్రారంభించి బత్తాయిలు అమ్ముకునేల రైతులకు వెసులుబాటు కల్పించామని మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపు దార్శనికతతో నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్ల తెలంగాణ స్వరూపం మారిపోయిందని, తెలంగాణ భారత దేశ ధాన్యగారం అయిందని మంత్రులు అన్నారు.