సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు..

52

ఆగస్ట్ 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా శాలపల్లిలో సీఎం హాజరయ్యే సభ స్థలాన్ని, ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహచర మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సి పి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం.. 30% శాతం ఫిట్ మెంట్ పి.ఆర్.సి, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పాత మార్కెట్ లో TNGO’S ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభకు ముఖ్య అతిథులుగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరైయ్యారు.