వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హుంటర్ రోడ్డులో కాకతీయ గౌడ్ హాస్టల్ భవనాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య,మేయర్ గుండా ప్రకాష్ రావు, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్న్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తిలను పోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. హరిత హారంలో తాటి, ఈత మొక్కలను నటుతున్నామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న కుల వృత్తిలకు పూర్వ వైభవాన్ని తేవడానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని పథకాలను ప్రారంభించారు. గతంలో గౌడ సోదరులను కేవలం ఓట్ల కోసమే చూసారు. కల్లులో అనేక ఔషధ మూలికలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టు పన్నును రద్దు చేశారు. ఆత్మ గౌరవంతో ఉండడానికి 2 వేల ఫెన్సన్‌ను అందిస్తున్నామన్నారు. హరితహారంలో 3 కోట్ల 75 లక్షల తాటి, ఈత చెట్లును పెట్టాం. అన్ని కులాల భవనాలకు 5 ఎకరాల భూమి 5కోట్ల నిధులను మంజూరు చేశారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.