హోమ్ క్వారేంటైన్‌లో జనగామ ఎమ్మెల్యే..

351
MLA Muthireddy
- Advertisement -

కరోనా లక్షణాలు లేని వారిని ఇంట్లో ఉంచే చికిత్స అందించవచ్చు అని ICMR స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ మేరకు కరోనా పాజిటివ్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిని డాక్టర్స్ పరిశీలించి హోమ్ క్వారంటైన్‌లో ఉండవచ్చు అని సూచించారు. దీంతో ఆయన ఇంట్లోనే క్వరెంటెన్ ఉంటున్నారు.

గత కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా సోకిన విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా సోకిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం. కోవిడ్‌-19 నిపుణుల కమిటీ సభ్యులు, నిమ్స్‌లో నెఫ్రలజీ విభాగ డాక్టర్ అయిన గంగాధర్ కూడా నిమ్స్ హాస్పిటల్ నుండి హోమ్ క్వారేంటైన్‌కి వెళ్ళారు.

- Advertisement -