ప్రభుత్వం అందించే వైద్యంపై ప్రజలకు విశ్వాసం, భరోసా కలిగిందన్నారు మంత్రులు ఈటెల రాజెందర్, జగదీష్ రెడ్డి. ఈసందర్భంగా నేడు నల్గొండ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రులు జగదీష్ రెడ్డి , ఈటెల రాజేందర్., ఎంపీ లింగయ్య యాదవ్, mla భూపాల్ రెడ్డి, zp ఛైర్మెన్ నరేందర్ రెడ్డి. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రకమైన ప్రాంతం నాగార్జున సాగర్ లో ఆధునాతన ఆసుపత్రిని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. నల్గొండ మెడికల్ కాలేజ్ ను 2019-20 విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. సూర్యాపేటలో కూడా ఈవిద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతె ప్రజలకు సూపర్ స్పెషాలిటి వైద్య సేవలు అందుతాయన్నారు.
మంత్రి ఈటెల రాజెందర్ మాట్లాడూతూ.. త్వరలోనే నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 650పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇకపై నల్గొండ ప్రజలు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఆధునాతన వైద్యం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో మెడికల్ విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తీ అప్రమత్తంగా ఉందని చెప్పారు