కోవిడ్ బాధితులకు మంత్రి వేముల భరోసా..

47
Minister Prashanth Reddy

ఆర్మూర్ డివిజన్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన 100 పడకల కోవిడ్ సెంటర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం పరిశీలించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి భరోసా కల్పించారు..అత్యవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు మరియు రెమిడిసివిర్ మందులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు.

అనంతరం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటికి హెల్త్ సర్వేను ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలిస్తూ…ఆశా వర్కర్లు,పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో మాట్లాడటం జరిగింది. లాక్ డౌన్ ఉన్నందున ప్రజలందరూ బయటకి రాకుండా ఇంటిలోనే ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,DMHO ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.