రక్తదానం చేసి ఓ మహిళ ప్రాణం నిలిపిన ట్రాఫిక్ పోలీస్‌..

37
Traffic police

మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక మహిళకు అత్యవసర ఆపేరేషన్ చేసేందుకు రక్తం అవసరం కాగా ఫోన్ ద్వారా తెలుసుకున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు వెంటనే యశోద హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేసి పేషెంట్ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చారు.

ఇప్పటికి ప్రమాద బాధితులకు, అత్యవసర ఆపరేషన్ ఉన్నవారికి 31 సార్లు రక్థదానం చేశారు, తెలిసినవారితో పాటు తెలియనివారు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే పోలీస్ ఉన్నత అధికారుల స్ఫూర్తితో రక్తదానం చేశానని నాగమల్లు తెలిపారు.