పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకాన్నికి సంబంధించిన గైడ్‌లైన్స్ జీవో విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గృహలక్ష్మి పేదలకు అందిస్తున్న వరంలాంటిదన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల అర్థికసాయం అందించనున్నట్టు తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లోకి లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్
గృహలక్ష్మి పథకంలో భాగంగా తొలివిడుతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మార్చి 9న జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించనుండగా.. మరో 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ మేరకు బడ్జెట్‌ను నిధులను సైతం కేటాయించింది. పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
Also Read: HarishRao:రాష్ట్రంలో ద్విముఖ వ్యూహం అమలు