NTR:దేవర కోసం షైన్‌

74
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్‌. ఎన్టీఆర్‌ నటిస్తోన్న సినిమా దేవర. జనతాగ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఆల్‌ ఇండియా స్టార్స్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే నరైన్‌ రామ్‌ జాయిన్‌ అయ్యారు. కాగా తాజాగా మరో మలయాళ యాక్టర్‌ దేవర టీంలో జాయిన్‌ అవుతున్నారు. అయనే దసరా విలన్‌ షైన్‌ టామ్‌ చాకో జాయిన్‌ కానున్నట్టు టీం ప్రకటించింది. ఫ్యాన్ మేడ్‌ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. షైన్ టామ్‌ చాకో ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేశాడు. విలక్షణ నటనతో ఎంటర్‌టైన్‌ చేసే ఈ మలయాళ నటుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.

Also Read: ఒకప్పటి చిరూ.. ప్రాజెక్టులు ఫిక్స్

దేవర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. దేవరలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Also Read: NANI:మీరంతా నా గుండెల్లో ఉంటారు

- Advertisement -