సీఎస్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ..

192
srinivas goud

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో సచివాలయంలో భేటి అయ్యారు. ఈ భేటిలో అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికి అన్ని శాఖల్లో ప్రమోషన్ లను జనవరి 31 లోగా ఇవ్వడంపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ లలో మినిమం సర్వీస్‌ను 3 ఏండ్ల నుండి 2 యేండ్లకు తగ్గించి ప్రమోషన్ లను ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎస్ సోమేష్ కుమార్‌తో చర్చించారు.