రోడ్ సేఫ్టీ పై విద్యార్దులకు అవగాహన: మంత్రి వేముల

388
Vemula-Prashanth-reddy
- Advertisement -

రోడ్ సేఫ్టీ పై విద్యార్దులకు అవగాహన కల్పించాలన్నారు రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఖైరతాబాద్ లోని ది ఇన్స్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ భవన్ లో రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ పై ఒక్క రోజు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… రోడ్ సేఫ్టీ పై అనేక విషయాలపై అవగాహన రావడానికి ఈ సెమినార్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ పై అందరూ ఆలోచిస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్ లో సంవత్సరానికి 12లక్షల మంది చనిపోగా.. 5కోట్ల మందికి గాయాలవుతున్నాయి. చాలా మంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల కుటుంబ పెద్లను కోల్పోయి అనాధలవుతున్నారు. రోడ్ యాక్సిండెట్ల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధపై కూడా భారం పడుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. రోడ్ సేఫ్టీ చాలా ప్రాముఖ్యత ఉన్న అంశం.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ సేప్టీ పై జాగ్రత్తగా పనిచేస్తున్నాయని చెప్పారు. వాహనాలు నడిపే వ్యక్తి అజగ్రత్త వల్లే యాక్సిడెంట్లు జరగుతున్నాయన్నారు. పాఠశాల విద్యలో రోడ్ సేఫ్టీ పై సిలబస్ పెడితే కొంత వరకు తగ్గించవచ్చని నా అభిప్రాయం. సెలబ్రెటీలు, ఇతర ప్రముఖులు రోడ్ సేప్టీ లో పాల్గోనేలా చర్యలు తీసుకుంటే కొంత వరకు యాక్సిడెంట్లు తగ్గించవచ్చు.. ఇంజనీర్లు యాక్సిడెంట్ అయ్యే ప్రాంతాలను గుర్తించి వాటిని సరిచేయాలి. పొల్యూషన్ చెక్ చేసి వాహనాల కండిషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చెయ్యాలని సూచించారు. లైసెన్స్ ఇచ్చే సమయంలో ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు, సూచనలు చేయలని తెలిపారు.

- Advertisement -