- Advertisement -
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తేలేదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా 9 నెలల కాలం ఉందని చెప్పారు.తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. తాము పేదలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని, అలాగే, ప్రధానమంత్రి నుంచి పీఎంఆర్ఎఫ్ వచ్చేలా చేయాలని అర్వింద్ ను అడిగితే ఆయన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చెప్పారు.
ఎంపీ అర్వింద్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, రాజకీయాల కోసం కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పారు. అర్వింద్ రైతులను మోసం చేశారని..పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి, ఆ మాట తప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉంటుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -