పచ్చదనం పెరగాలి…ప్రకృతిని పరిరక్షించుకోవాలి

181
vemula prashanth reddy
- Advertisement -

గచ్చిబౌలిలో ని హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిత కేంద్రంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పచ్చదనం పెరగాలి…ప్రకృతిని పరిరక్షించుకోవాలి అనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా..హౌసింగ్ డిపార్ట్మెంట్,హౌసింగ్ కార్పొరేషన్ తరుపున మా డిపార్ట్మెంట్ సిబ్బంది అందరితో కలిసి 2.8 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది.

ఈ కేంద్రంలో నాటిన మొక్కలు అన్ని సంరక్షించబడాలన్నారు.హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నది..మన వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి.ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇన్స్టిట్యూషన్లో, ట్రైనింగ్ సెంటర్లో ఖాళీ స్థలం ఉన్న చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి.

పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది .మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న హౌసింగ్ డిపార్ట్మెంట్,హౌసింగ్ బోర్డు,కార్పొరేషన్ సిబ్బందికి నా శుభాకాంక్షలు, అభినందనలు మొక్కలు నాటాలని మా సిబ్బంది అందరూ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం..ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,సి.ఈ లు రవీందర్ రెడ్డి,రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -