మాజీ ఎంపీ కవితకు పార్టీ సభ్యత్వం అందజేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

311
kavitha Vemula Prashanth Reddy
- Advertisement -

నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం అందజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్ లోని కవిత నివాసానికి వెళ్లిన మంత్రి సభ్యత్వం అందజేశారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా సాగుతుందన్నారు.

అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందన్నారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యం కంటే ఇంకా ఎక్కువ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల, సీఎం కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు.

తెలంగాణ హక్కులు కాపాడటం ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే సాధయమన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

- Advertisement -