చింతమడక అభివృద్దికి రూ. 10 కోట్లు

856
kcr chinthamadaka
- Advertisement -

త్వరలో సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గ్రామానికి ప్రత్యేక నిధులు విడుదల చేసింది సర్కార్‌.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి పది కోట్లు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను క్షేత్రస్ధాయిలో పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం కేసీఆర్‌ సభా సమావేశ స్థలం, సహపంక్తి భోజనాల ఏర్పాటు, హెలీప్యాడ్‌ తదితర ప్రాంతాల గుర్తింపు చేసినట్లు తెలిపారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వం సిద్ధం చేశామన్నారు.

గ్రామంలో 596 ఇండ్లు, 874 కుటుంబాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతుల గుర్తింపు, భూమిలేని వారి వివరాలు, పంచాయతీ రాజ్‌ ఆధ్వర్యంలో ప్లాంటేషన్‌, శానిటేషన్‌, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టామన్నారు.

- Advertisement -