గోబెల్స్‌ ప్రచారంలో బీజేపీకి నోబెల్ ఇవ్వాలి: హరీశ్‌ రావు

130
harishrao

గోబెల్స్ ప్రచారంలో బీజేపీకి నోబెల్ ఇవ్వాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్క పేట, చికోడ్, శిలాజినగర్ తదితర గ్రామాల్లో అభ్యర్థి టీఆరెస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు… లింగన్న ఆశయాలను సాధించడానికి సుజాతక్క మీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఓట్లు అనగానే కాంగ్రెస్‌,బీజేపీ వాళ్లు వచ్చారు….వాళ్లన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు లో ఇక్క పైసా మీది ఉన్నదా ? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా ?
అని ప్రశ్నించారు.

24 గంటలు ఫ్రీ కరెంట్, రైతు బంధు, బీమా, కల్లాలు కట్టిస్తా అంటున్నారు కేసిఆర్….బాయిల దగ్గర మీటర్లు, విదేశీ మక్కలు తెచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నరు బీజేపీ వాళ్ళు ఈ రెండు పార్టీల్లో ఏది కావాలో తేల్చుకోవాలన్నారు. దొంగ రాత్రి కరెంటు ఇచ్చి రైతుల ఉసురు తీసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. 500 కోట్లు ఇస్తా మీటర్లు పెట్టలని ప్రధానమంత్రి చెబితే రైతుల సంక్షేమం కోసం ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు.