కాంగ్రెస్,బీజేపీలపై మండిపడ్డ మంత్రి తలసాని‌..

195
minister talasani
- Advertisement -

రాజకీయాలకు అతీతంగా తమ పార్టీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశామహల్ నియోజకవర్గంలోని ఇటీవల కురిసిన వర్షాలకు ప్రమాదవశాత్తు కూలిపోయిన ఇండ్ల భాదితులకు ఒక్కోక్కరికి 25వేల చొప్పున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రస్ట్ చైర్మన్ టీఆరెస్ రాష్ట్ర నాయకులు నంద్ కిశోర్ వ్యాస్ బిలాల్,మంగలాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తో కలసి చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…లక్‌డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న దాదాపు 50వేల కుటుంబాలకు చెందిన నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి,ఇప్పుడు వర్షాలకు నిరాశ్రయులైన ఇండ్ల భాదితులను ఆదుకుంటున్న అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో గొప్పవి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్.ఆర్.ఎస్,బి.ఆర్.ఎస్,జీఓ 58 ద్వారా నిరుపేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి అన్నారు. ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు 6సంవత్సరాలలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు.

60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ చేయడంపై జీర్ణించుకోలేక లేని పోనీ ఆరోపణలను చేస్తుందని దుయ్యబట్టారు.మరో పార్టీ మతాలను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.టీఆరెస్ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ఏ ఎలక్షన్స్ వచ్చిన టీఆర్‌ఎస్ కె ఓటు వేసి గెలిపించుకుంటారని ఆ ధీమా మాకుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

- Advertisement -