మొక్కలు నాటిన తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ సభ్యులు..

134
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఎల్.బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్ మరియు సభ్యులు మొక్కలు నాటారు.

అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎం.పి సంతోష్ కుమార్ ను అభినందిస్తూ వారి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటమని తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్ మరియు సభ్యులుతెలిపారు.

దేశ వ్యాప్తంగా విస్తరించి, తెలంగాణ రాష్ట్రన్ని ఆకుపచ్చ వణంగా తిరిచిదిద్దేదుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ కబడ్డీ ప్లేయర్లు అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ లు నర్సింగ్ రావు, ఎల్లయ్య , జాతీయ గోల్డ్ మెడల్ ప్లేయర్లు గీత గౌడ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.