గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో కిరణ్‌..

119
hero kiran

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి హీరో కిరణ్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించి దేశ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందిస్తున్నానని హీరో కిరణ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేను ఒకడిగా పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ జబర్దస్త్ శేషు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ సాగర్ సొసైటీలో తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన హీరో కిరణ్. మరో ముగ్గురు ( హీరో క్రిష్ , నటులు కిరణ్ , యస్.వి.యస్ నాయుడు )లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటల్సింది గా పిలుపునిచ్చారు.