రాష్ట్రానికి సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని వారు ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో రైతులు లేరా? గొల్లకుర్మలు లేరా? అని సూటిగా ప్రశ్నించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరి పథకాలు లేవన్నారు. బీజేపీ నాయకులకు దమ్మంటే గొర్రెల పంపకం వంటి ఒక్క పథకాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. చేతనైతే సద్విమర్శలు చేయాలని, వ్యక్తి గత దూషణలు సరికావని హితవు పలికారు.