తెలంగాణలో మళ్ళీ లాక్‌డౌన్‌.. ఖండించిన మంత్రి తలసాని..

221
Minister Talasani Srinivas
- Advertisement -

తెలంగాణలో మళ్ళీ లాక్‌డౌన్‌ అంటు తన పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న పుకర్లను ఖండించారు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎక్కడా తను అలాంటి వ్యాఖలు చేయలేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తుండగా, స్థానిక బీజేపీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు.

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నిజంగా ప్రజలపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించాలని సవాల్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా బీజేపీ నేతలు పబ్లిసిటీ కోసమే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాక్ డౌన్ విషయమై ఒక చానల్‌లో తన పేరుతో వచ్చిన ప్రకటనను మంత్రి ఖండించారు.

- Advertisement -