నగరంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తలసాని..

205
Talasani Srinivas Yadav
- Advertisement -

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న బస్టాప్,ఫుట్ పాత్ ఇతర పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరును ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన చేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి బస్ స్టాప్‌లను అందంగా తీర్చిదిద్దాలని ఇక్కడ థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంకల్పించారు. 30 కోట్ల రూపాయల తో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడి కి కొన్ని లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు.జిఎచ్‌ఎంసి,ట్రాఫిక్,ఇతర శాఖల సమన్వయంతో దీన్ని దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

ఒక సంవత్సరం లోనే దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని..ఇక్కడ బెగ్గర్ వ్యవస్థను కూడా రూపుమాపుతామన్నారు.తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అందరికి ఉపాధి కల్పిస్తున్నారు అందరూ ఎదో ఒక పని చేసుకొని బ్రతకాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి. కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాక గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.దేశమంతా కరోనా సంక్షోభం ఉంటే ఇక్కడ హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి లాక్ డౌన్ పీరియడ్‌ను అద్భుతంగా వినియోగించుకొని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. లాక్ డౌన్ ముగిశాక రోడ్లపైకి వచ్చిన జనం ఈ రోడ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని మంత్రి తలసాని పేర్కొన్నారు.

- Advertisement -