రాష్ట్రాభివృద్ధికి సహకరించండి:బీజేపీ నేతలకు తలసాని సూచన

37
Talasani

ప్రభుత్వం మీద విమర్శలు మాని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని బీజేపీ నాయకులకు సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని…రాష్ట్రంలో రాజ‌‌కీయాల‌కు అతీతంగా అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు.

బీజేపీ నేత‌లు బాధ్యాత‌యుతంగా మాట్లాడాల‌ని సూచించారు. మ‌తం పేరుతో బీజేపీ నాయ‌కులు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీజేపీ ఇత‌ర పార్టీల‌తో అనైతిక పొత్తు పెట్టుకుని ఏయే రాష్ర్టాల్లో గెలిచారో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

గ్రేటర్‌లో టీఆర్ఎస్ పార్టీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ఉంద‌ని అందుకే సాధార‌ణ మెజార్టీతో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ గెలిచామ‌ని తెలిపారు.మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌డంతో.. ప్ర‌శంసించాల్సింది పోయి అన‌వ‌స‌ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న వారికి గౌర‌వం ఇవ్వండి.. లేదంటే మీరు తిట్టిన‌ట్టే.. తాము కూడా తిట్టాల్సి వ‌స్తుంద‌ని త‌ల‌సాని అన్నారు. ముఖ్య‌మంత్రిని తిడితే త‌మ‌కు దేశ నాయ‌కుల‌ను తిట్ట‌డం చేత కాదా? అని ప్ర‌శ్నించారు. త‌మ‌కు సంస్కారం ఉంది కాబ‌ట్టే.. న‌ష్టం జ‌రిగినా దేశ నాయ‌కుల‌పై గౌర‌వం చూపుతున్నామ‌ని తెలిపారు.