- Advertisement -
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గొట్టిముక్కుల గ్రామంలోని సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో చేప పిల్లలను వదిలారు.
జిల్లాలో కోటి 11 లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం కొనసాగుతుందని…..చెరువులు, ప్రాజెక్ట్ ల్లో ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలు వదులుతున్నామని తెలిపారు.ముదిరాజ్, మృత్సకారులు ఆర్థికంగా లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, విద్యా, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లు మోతీలాల్, చంద్రయ్య పాల్గొన్నారు.
- Advertisement -