గ్రేటర్‌లో మరో 26 బస్తీ దవాఖానాలు..

197
talasani srinivas
- Advertisement -

ఈ నెల 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు గ్రేటర్‌లో మరో 26 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చొరవతోనే బస్తీ దవాఖానా ల ఏర్పాటు జరుగుతుందన్నారు.వేలాది రూపాయలు ఖర్చు చేసి సరైన వైద్యం చేయించుకోలేక పోతున్న పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య చికిత్సలు అందుతున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బస్తీ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి KTR, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్ లు ప్రారంభించనున్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దావఖాన ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో300 బస్తీ దవాఖానల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం అని ప్రస్తుతం 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.

- Advertisement -