ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు బాధ్యత ఉందా.. కాంగ్రెస్ నేతలు జోకర్లు… బ్రోకర్లు.. బఫున్లు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి సరైన సూచనలు ఇచ్చే స్థితిలో కూడా లేరు. అఖిలపక్షం పార్టీలు అలీ బాబా నలభై దొంగల బ్యాచ్ అన్నారు.
దేశంలో రైతు రాజు కావాలని అనుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్.. కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం ఎరువులు కూడా అందుబాటులో ఉంచుతున్నాం..కరోనా సంక్షోభంలో రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. ఓ వైపు కరోనా వైరస్‌తో పోరాడుతూనే అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామన్నారు. గతంలో రైతులు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బార్డర్‌లో పుణ్యానికి పనిచేశారా.. సరిహద్దుల్లో పనిచేస్తే ఏంటి ?అని మంత్రి తలసాని ప్రశ్నించారు.
మిలాగా దొంగల్లాగా దోచుకునే వాళ్ళం కాదు..మీ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టులకు అడ్వాన్స్ టెండర్లు ఇచ్చి అడ్డగోలుగా దోచుకున్నారు.కానీ మా ప్రభుత్వంలో రైతు బంధు పథకము దేశానికే ఆదర్శంగా నిలిచింది. వలస కార్మికుల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. వలస కూలీలను సొంత డబ్బులు పెట్టుకొని పోవాలని అన్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం వలస కూలీలా పట్ల సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో వారిని స్వస్థలాలకు పంపిస్తున్నాము.
ఈ దేశములో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించిన పంటలను గిట్టుబాటు ధర ఇచ్చి కొంటలేదు.ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తుంది. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యంపై మాట్లాడుతున్నారు..తాగేదంతా మిరే మల్ల మాట్లాడుతున్నారు. నిరంతరం ఈ ప్రభుత్వం రైతాంగం కోసం,రైతు సంక్షేమం పని చేస్తుంది.. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అసెబ్లీలో లేకుండా పారిపోయిన దొంగలు మీరు..అని మంత్రి ఎద్దేవ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించట్లేదు.ఏ సమయంలో ఎం మాట్లాడతారో తెలియదు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచింది కేంద్రం కూడా అభినందించిది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.ప్రజలందరికి సీఎం కేసీఆర్ ఓ ధైర్యాన్ని నింపారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ గా ఉద్యోగం చేసాడు. దానికి నేనేదో నడిపిస్తా అని అనుకోవడం భ్రమ అన్నారు.
ఇండస్ట్రీయల్ గ్రోత్ పెరిగింది ఐటీ రంగం మెరుగైంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద పరిశ్రమలు మన హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించాం. కరీంనగర్‌లో కంటైన్మెంట్ ఏరియాలు ఏర్పాటు చేసి దేశానికే కంటైన్మెంట్ ను పరిచయం చేసాం.. రేషన్ కార్డు లేనివాళ్లకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందని మంత్రి తలసాని తెలిపారు.