టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కళాసిగూడ లోని ప్రభుత్వ పాఠశాలలో DEOవెంకటనర్సమ్మ తో కలిసి విద్యార్ధులకు బుక్స్ పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
అనంతరం రాంగోపాల్ పేట కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం..కేటీఆర్ యూత్ ఐకాన్ ,డైనమిక్ లిడర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆణిముత్యాన్ని మనకు అందించారని తెలిపారు.
తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ ఐటీ రంగంలో ప్రపంచమే మన నగరం వైపు చూసేలా చేశాడు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలు మన దగ్గర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారంటే అందులో మంత్రి కేటీఆర్ కృషి ఎంతగానో ఉంది..ఈ రోజు ఐటీ రంగంలో లక్షలాది మందికి ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
మున్సిపల్ మంత్రిగా సిటీలో రోడ్లు,ఫ్లయ్ ఓవర్లు గాని కొత్త ప్లానింగ్ తో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు..మంత్రి కేటీఆర్ ఉన్నత శిఖరాలను ఎదగాలి..కేటీఆర్ న్యాయకత్వ పటిమ రాష్ట్ర ప్రజలకు దేశానికి ఎంతో అవసరం..మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు
ఓల్డేజ్ హోమ్స్ లో పండ్లు పంపిణీ, హరితహారం తో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు.