పాతబస్తీలో కరోనా..తలసాని సమీక్ష

270
talaani
- Advertisement -

పాతబస్తీలో కరోనా నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఓల్డ్ సిటీ లో కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో చార్మినార్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 766కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 562 ఉండగా 186 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 18 మంది మృతి చెందారు.

- Advertisement -