యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సాయికిరణ్‌కు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన తలసాని ప్రచారంలో కూడా ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాల కారణంగానే ఓటమి పాలయ్యామని చెప్పారు.
ఓడిపోయినా బాధ్యతతో పనిచేస్తామని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన కిషన్ రెడ్డి,మోడీ,జగన్ కు అభినందనలు తెలిపారు.కేసీఆర్ ఎన్ని విజయాలు వచ్చిన ఒదిగి పనిచేయాలని చెబుతారని తెలిపిన తలసాని సబ్బండ వర్గాలను మా ప్రభుత్వం ఆదరించిందన్నారు.
సంక్షేమంలో అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పారు. ఓటమితో గుణపాఠం నేర్చుకొని ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తామని వచ్చే 5ఏళ్ళు కష్టపడి పనిచేస్తామన్నారు. కేటీఆర్ అన్ని ఎన్నికల్లో చాలా కష్టపడ్డారాన్న తలసాని… గెలిస్తే ఓ లాగా.. ఓడిపోతే మరోలాగా మాట్లాడటం సరికాదన్నారు.
32ఏళ్ళ చిన్న వయసులో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు తలసాని సాయికిరణ్. సింపతీ అవసరం లేదని.. ప్రజల వద్దకు వెళ్ళి వారితో కలిసి పనిచేస్తానని చెప్పారు. గెలిస్తే ఎలా పనిచేస్తానో ఇప్పడు అలానే పనిచేస్తానని చెప్పిన సాయి కిరణ్ ప్రచారంలో తనకు సహకరించిన కార్యకర్తలు,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.